దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అందుకు తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.
దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అందుకు తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ () లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల () సమన్వయ కమిటీ సదస్సును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసింగ్‌లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను వివరించారు. నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో రాష్ట్రాల మధ్య సమన్వయ అవసరాన్ని ముఖ్యమంత్రి గారు నొక్కి చెప్పారు.
ఆయా రాష్ట్రాలు తమ సొంత వనరులు, ప్రయత్నాలతో మాత్రమే నేరరహిత రాష్ట్రాలుగా మార్చడం సాధ్యం కాదు. అందుకు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం. అత్యంత కీలకమైన ఇలాంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించి, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి అని ముఖ్యమంత్రి గారు సదస్సును ఉద్దేశించి కోరారు.
దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, నేరాల రేటును అత్యంత కనిష్ఠ స్థాయికి తగ్గించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయంతో పనిచేయడానికి పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఐసీసీసీ () వ్యవస్థను సమన్వయం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మనమందరం సమష్టిగా కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సదస్సు ఫలవంతమైన, నిర్మాణాత్మక చర్చలతో సాగాలని ఆకాంక్షించారు.
భద్రత, రక్షణ, నిస్పాక్షికత, నైతిక విలువలతో కూడిన సమర్థవంతమైన వ్యవస్థగా పోలీసింగ్ పనిచేయాలని ప్రజలు కోరుకుంటారు. పోలీసు వ్యవస్థకు ప్రభుత్వం సమకూర్చే వనరులను ఖర్చుగా భావించకుండా, మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు పెట్టే పెట్టుబడిగా నేను భావిస్తాను. అందుకు ఎప్పటికప్పుడు అవసరమైన సంస్కరణలను తీసుకురావాలని భావిస్తాను.
రోజురోజుకు నేరాల స్వభావం మారుతున్న ఈ కాలంలో ఎస్ఆర్పీసీసీ వంటి వేదికలు ఎంతో కీలకంగా మారుతాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ కూడా మారాలి. పోలీసింగ్‌లో సంస్కరణలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చెప్పారు.
పోలీసు వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో చేపట్టిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలను అరికట్టడం, వామపక్ష తీవ్రవాద హింసకు ముగింపు పలకడం వంటి రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభను చాటుకుని గుర్తింపు పొందింది.












