మచిలీపట్నం, 2026-11-29
దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లు అందించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లు అందించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ () కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎస్బీఐ చేస్తున్న సేవా కార్యక్రమాలను రాజేంద్రప్రసాద్ అభినందించారు. ఇదే విధంగా మరింత మంది విద్యార్థులకు సైకిళ్లు అందించేలా బ్యాంకు అధికారులు ముందుకు రావాలని కోరారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ సందర్భంగా సైకిళ్ళను బహుమతిగా అందజేసిన రీజినల్ మేనేజర్ సుకుమార్ గారిని, అలాగే నూతనంగా చైర్మన్గా ఎన్నికైన ప్రవీణ్ కుమార్ గారిని ఉపాధ్యాయులు శాలువాలు కప్పి సన్మానించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, తెలుగుదేశం నాయకులు సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి కుమార్, డాక్టర్ ద్విజేంద్ర బాబు, డాక్టర్ చంద్రమోహన్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సుకుమార్, బ్రాంచ్ మేనేజర్ కే వి రమణారావు, ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరావు, కౌన్సిలర్ రామనోళ్ల శ్రీకాంత్, గఫర్, ఛైర్మెన్ ఆరేపల్లి శివసాయి, జంపాన తేజా, ఇంకా బ్యాంకు అధికారులు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


