వరుసగా రెండోసారి ఏఎఫ్సీ అండర్-17 ఆసియా కప్‌కు అర్హత సాధించే దిశగా భారత యువ ఫుట్‌బాల్ జట్టు దూసుకుపోతోంది. ఆతిథ్య మలేషియాతో కౌలాలంపూర్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగే గ్రూప్-ఈ చివరి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కనీసం డ్రా సాధించినా భారత్ 2027 ఆసియా కప్‌కు అర్హత సాధిస్తుంది.
ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లతో గ్రూపులో అగ్రస్థానంలో ఉంది. సింగపూర్‌పై 4-2, గువామ్‌పై 12-0, పాలస్తీనాపై 4-1తో విజయం సాధించింది. మలేషియా, పాలస్తీనా జట్లు ఆరు పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కనీసం డ్రా సాధించినా భారత్ 2027 ఆసియా కప్‌కు అర్హత సాధిస్తుంది. అయితే డ్రా కోసం ఆడకుండా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని కోచ్ మెహ్రాజుద్దీన్ వాడూ స్పష్టం చేశారు. 2013 నుంచి 29 వరకు ఉజ్బెకిస్థాన్‌లో ఆసియా కప్ టోర్నీ జరగనుంది.


