బాపట్ల, 2026-11-28
బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన సర్పంచులు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు నూతన సర్పంచులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
కర్లపాలెం షేక్ బాజీ యేట్రవారిపాలెం చీరాల వెంకట లక్ష్మి పెదపులుగువారిపాలెం పులుగు వెంకటసుబ్బమ్మ నాగరాజుపాలెం షేక్ వహిదాబి నల్లమోతువారిపాలెం పొన్నం యానాదమ్మ తుమ్మలపల్లి దర్శి వెంకటసుశీల దమ్మన్నవారిపాలెం మన్నెం పోతురాజు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏడుగురు సర్పంచులు ఎమ్మెల్యేను కలవడంతో, కర్లపాలెం మండలంలో నూతన గ్రామ పాలనకు శ్రీకారం చుట్టినట్లయింది. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా సర్పంచులు పేర్కొన్నారు.


