ఇటలీలోని టూరిన్‌లో జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో అమెరికా యువ టెన్నిస్ సంచలనం బెన్ షెల్టన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.
రెండు గంటల ఏడు నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో షెల్టన్ కీలక సమయాల్లో అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఈ విజయంతో గ్రూప్ దశలో రెండు విజయాలు, ఒక ఓటమితో తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు, అలెగ్జాండర్ జ్వెరెవ్.. ఆర్థర్ ఫిల్స్‌పై తొలి సెట్ గెలవడంతో షెల్టన్ సెమీఫైనల్ బెర్తు అధికారికంగా ఖరారైంది. ఈ పరిణామంతో జోడార్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ విజయంతో బెన్ షెల్టన్ ఒక అరుదైన రికార్డును కూడా తన పేరు మీద లిఖించుకున్నాడు. 2004లో ఆండీ రాడిక్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ సెమీఫైనల్‌కు చేరిన అత్యంత పిన్న వయస్కుడైన అమెరికా ఆటగాడిగా షెల్టన్ చరిత్ర సృష్టించాడు.


