సంబంధిత (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 20
బాపట్ల మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
2వ సాధారణ స్థానిక సంస్థల బాపట్ల మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న బాపట్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అక్కడి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈ నెల 23, 24 తేదీలలో మున్సిపల్ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ (పర్చూరు నియోజకవర్గం) సిబ్బందికి 24న, రెండో దశ (చీరాల, వేమూరు నియోజకవర్గాలు) సిబ్బందికి 27న, మూడో దశ (బాపట్ల, రేపల్లె నియోజకవర్గాలు) సిబ్బందికి 30న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది తమ ఎన్నికల విధుల ఉత్తర్వు, గుర్తింపు కార్డును చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అదనపు సమాచారం కోసం పట్టణ ప్రాంతాల్లో సంబంధిత మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.







