ఘనంగా (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పారా క్రీడా పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసే లక్ష్యంతో బాపట్ల జిల్లాలో సోమవారం జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలను ఘనంగా నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలకు జిల్లాలోని పలువురు దివ్యాంగ బాలబాలికలు, యువ క్రీడాకారులు ఉత్సాహంగా హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న పారా క్రీడా పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసే లక్ష్యంతో బాపట్ల జిల్లాలో సోమవారం జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలను ఘనంగా నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలకు జిల్లాలోని పలువురు దివ్యాంగ బాలబాలికలు, యువ క్రీడాకారులు ఉత్సాహంగా హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ ఎంపిక పోటీల్లో పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్, పారా తైక్వాండో, టేబుల్ టెన్నిస్ తదితర ఆరు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. సాంకేతిక అధికారుల పర్యవేక్షణలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, కోచ్‌లు, సిబ్బంది సమన్వయంతో పోటీలను క్రమబద్ధంగా నిర్వహించారు. క్రీడాకారుల తల్లిదండ్రులు సైతం హాజరై వారికి ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి సమగ్ర శిక్షా శాఖ ప్రతినిధి ఎం. జ్యోత్స్న హాజరై క్రీడాకారులను అభినందించి, అవసరమైన సహకారం అందించారు.
జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు, 2 తేదీల్లో విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీల్లో బాపట్ల జిల్లా తరఫున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ దివ్యాంగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటుకునే అవకాశాలు కల్పించడమే ఈ ఎంపిక పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులను, వారికి అండగా నిలిచిన తల్లిదండ్రులను అభినందించారు. పోటీల నిర్వహణకు సహకరించిన సమగ్ర శిక్షా శాఖ ప్రతినిధులు, సాంకేతిక అధికారులు, కోచ్‌లు, సిబ్బంది, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.



