సహకరించాలని (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 20
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 23 వరకు కొనసాగుతుంది.
మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో 172 గ్రామ పంచాయతీలకు గాను 49 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు.
నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు తప్పనిసరిగా అమలు చేయాలి. కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటి వాటికి అనుమతి లేదు.
పోలీస్ చట్టం సెక్షన్ 30, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం విధించిన నిషేధాజ్ఞలను తప్పనిసరిగా పాటించాలి. సీసీ కెమెరాలు, అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర పోలీస్ నిఘా కొనసాగుతుంది.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.







