కైకలూరు, 2026-11-27
గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కైకలూరు, మండవల్లి మండలాల్లో ఆయన కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నేడు ఆయన కైకలూరు మండలంలోని పల్లెవాడ, ఆటపాక గ్రామాలలో, మండవల్లి మండలంలోని చావలిపాడు, మండవల్లి గ్రామ పంచాయతీలలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ ఎన్నికలు కేవలం సర్పంచ్‌ను, వార్డు సభ్యులను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి మన గ్రామాల అభివృద్ధికి, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఎన్నికలు అని కామినేని శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.
అదే అభివృద్ధి మన గ్రామాల్లో కూడా కొనసాగాలంటే, స్థానిక సంస్థల్లో కూడా అభివృద్ధికి కట్టుబడి ఉండే నాయకత్వం అవసరం. అందుకే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థులకు మీరంతా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఈ ప్రచారంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


