చీరాల, 2026-11-25
బాపట్ల జిల్లా చీరాల మండలంలోని ఈపురుపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం కొనసాగుతోంది. బుధవారం బోయినవారిపాలెం గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చీరాల మండలంలోని ఈపురుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో, కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మండేపూడి నాగేశ్వరరావు, వార్డు సభ్యుల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. బుధవారం ఈపురుపాలెం పంచాయతీ పరిధిలోని బోయినవారిపాలెం గ్రామంలో నిర్వహించిన విస్తృత ప్రచార కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్యతో పాటు సర్పంచ్ అభ్యర్థి మండేపూడి నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే మండేపూడి నాగేశ్వరరావు నాయకత్వానికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.
గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలంటే కూటమి బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







