కావేరీ నదీ జలాల వివాదంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక నుంచి అదనంగా 11 టీఎంసీల నీటిని విడుదల చేయించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
కావేరీ జలాల కేటాయింపులో తమకు రావాల్సిన నీటిలో కొరత ఏర్పడిందని, దీంతో రైతులు, పంటలు నష్టపోతున్నాయని తమిళనాడు వాదించింది. అయితే, వర్షాభావ పరిస్థితుల కారణంగా తమ రాష్ట్రంలోనూ నీటి కొరత ఉందని కర్ణాటక తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.


