అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ బలహీనపడటం, ముడి చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,107 డాలర్లకు చేరింది.
అమెరికా డాలర్ బలహీనపడటం, ముడి చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,107 డాలర్లకు చేరగా, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1 శాతం పెరిగాయి. చమురు ధరలు తగ్గడం వల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో కొంత వెసులుబాటు చూపవచ్చనే అంచనాలు బంగారానికి మద్దతునిచ్చాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, ద్రవ్యోల్బణ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. చైనా కేంద్ర బ్యాంకు కూడా అక్టోబర్లో సుమారు 25.8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే, లాభాల స్వీకరణ, డాలర్ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.





