హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటిస్తున్న కొత్త పాన్ ఇండియా సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అశోక క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్ మేక సూపర్ హీరోగా కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా భావిస్తున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఆమెతో పాటు నటుడు వినయ్ రాయ్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది.





