క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-25
క్రైస్తవులకు ప్రధానమైన క్రిస్మస్ పండుగ నెల బుధవారం ప్రారంభమైంది.
క్రైస్తవులకు ప్రధానమైన క్రిస్మస్ పండుగ నెల బుధవారం ప్రారంభమైంది. పండుగ సందర్భంగా క్రైస్తవుల ఇళ్లలో సందడి ప్రారంభం కాగా, పండుగకు వినియోగించే స్టార్స్, శాంటాక్లాజ్ (క్రిస్మస్ తాత) బొమ్మలు, అలంకరణ సామగ్రి విక్రయాలు ఊపందుకున్నాయి. యేసుక్రీస్తు భూమిపై జన్మించిన రోజును క్రైస్తవులు క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, చర్చిలు విద్యుద్దీపాలతో మరింత శోభను సంతరించుకుంటాయి.
చర్చిలకు వచ్చే సభ్యుల ఇళ్లను సందర్శించేందుకు క్యారల్ పార్టీలకు సంఘ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనల అనంతరం నగరంలోని తమ సభ్యుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెబుతుంటారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి వాహనాల్లో క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ సంఘ నాయకులు, మహిళలు, యువకులు, పిల్లలు సభ్యుల ఇళ్లకు వెళ్లి, వారికి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు కానుకలు అందజేస్తారు. క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుటకు సన్నాహాలు మొదలయ్యాయి.







