పామూరు, 2026-11-20
మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్గా కందుల రామిరెడ్డి ప్రమాణ స్వీకారం శుక్రవారం మార్కాపురంలో అట్టహాసంగా జరిగింది.
మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్గా కందుల రామిరెడ్డి ప్రమాణ స్వీకారం శుక్రవారం మార్కాపురంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు మండల ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, పామూరు సింగిల్ విండో మాజీ చైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా కందుల రామిరెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. జడ్పీ చైర్మన్గా నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లెబోయిన బాలబ్రహ్మం, మోపాడు నీటి సంఘం చైర్మన్ చుంచు కొండయ్య, కంబాలదిన్నె ఎంపీటీసీ పోకా వెంకటరత్నం, మాజీ సింగిల్ విండో చైర్మన్ గద్దే గంగయ్య చౌదరి, మాజీ సర్పంచ్ మల్లెబోయిన గురుబ్రహ్మం, మాజీ ఎంపీటీసీ చెనికల మాలకొండయ్య, టీడీపీ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్, మెట్లు రాహుల్ యాదవ్, స్టూడియో మల్లికార్జున, రైస్ ట్రేడర్ అధినేత హాజీ గౌస్, గాజులపల్లి వెంకటేశ్వరరెడ్డి, బైరెడ్డి జస్వంత్ రెడ్డి, యరసింగు రాయుడు, మైనార్టీ నాయకులు గౌస్ బాషా, స్టాంప్ రైటర్ రఫీతో పాటు పలువురు పాల్గొన్నారు.


