కైకలూరు, 2026-11-28
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం కైకలూరు కోరుకొల్లు రోడ్డు నందు గల మహాత్మా జ్యోతిరావుపూలే గారి విగ్రహానికి 28/11/2026 న ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో జయమంగళ వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బొమ్మానబోయిన విజయలక్ష్మి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బూరుబోయిన శ్రీనివాస్, తెంటు మధుబాబు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ గంగునేని వర ప్రసాద్, తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పూల రాజి పాల్గొన్నారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు మరియు టిడిపి సీనియర్ నాయకులు కట్టా గోపి, నియోజకవర్గం ప్రధానకార్యదర్శి బలే చిరంజీవి, టిడిపి నాయకులు మరియు రాష్ట్ర దళిత నాయకులు జక్కుల విజయ్ కుమార్, బిజెపి జిల్లా నాయకులు బొల్లా శ్యామలరావు, బిజెపి నాయకులు మరియు బీసీ నాయకురాలు కళ్యాణి, జి శివ, తుపాకుల నాంచారయ్య తదితరులు మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


