చీరాల, 2026-08-28
వేటపాలెం మండలం కొత్తపేటలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, మద్దులూరి బాలకొండమ్మ దంపతులు తమ నూతన గృహానికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వేటపాలెం మండలం కొత్తపేటలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, మద్దులూరి బాలకొండమ్మ దంపతులు తమ నూతన గృహానికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించి నూతన గృహంలోకి ప్రవేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు తమ తనయులు మద్దులూరి గౌరీ అమర్నాథ్, మద్దులూరి మహేంద్ర నాథ్, కుమార్తె దేవితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, వాస్తు పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు.
ముఖ్య అతిథిగా ఉగ్గిరాల
గృహప్రవేశ కార్యక్రమానికి వేటపాలెం మండలం జనసేన పార్టీ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఉగ్గిరాల మార్కండేయులు కుటుంబ సమేతంగా హాజరై, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, బాలకొండమ్మ దంపతులతో పాటు వారి కుమారులు గౌరీ అమర్నాథ్, మహేంద్ర నాథ్లకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో గృహప్రవేశ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.











