వేటపాలెం, 2026-11-25
వేటపాలెం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, కూటమి సర్పంచ్ అభ్యర్థి నాగ పద్మజ ఒకటో వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని మద్దతు కోరారు.
క్రౌన్ హ్యూమన్ రైట్స్, వేటపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేటపాలెం గ్రామపంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి నాగ పద్మజ ఒకటో వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటూ మద్దతు కోరారు. ఈ సందర్భంగా తన ఎన్నికల గుర్తు మంచంపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ, గ్రామ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలని కోరారు. అలాగే, కూటమి బలపరిచిన ఒకటో వార్డు సభ్యురాలి అభ్యర్థిని కూడా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో పాల్గొన్న ఎంపీటీసీ-1 అభ్యర్థి సైతం ఓటర్లను కలిసి, సర్పంచ్ అభ్యర్థి నాగ పద్మజతో పాటు వార్డు సభ్యురాలి అభ్యర్థికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఇంటింటికీ తిరుగుతూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంతో ఒకటో వార్డులో సందడి నెలకొంది.







