ఒంగోలు, 2026-11-26
రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా, అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నేత నీలం రూపొందించిన ఎస్సీ, ఎస్టీ ఓటు హక్కు నియమావళి గోడపత్రికను జిల్లా కలెక్టర్ రాజాబాబు గురువారం ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమంలో, పంచాయితీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నామినేషన్లను అడ్డుకున్నా, ఓటర్లపై దౌర్జన్యం చేసినా ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు లేకుండా, ఆయన విగ్రహాలకు నివాళులర్పించకుండా, అంబేద్కర్ పట్ల అంటరానితనం పాటిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం న రిపబ్లిక్ డే గా జరుపుతూ, అంబేద్కర్ ఫోటో లేకుండా భరతమాత ఫోటోలకు దండ వేస్తూ మనువాదాన్ని పాటిస్తున్నాయని నీలం నాగేంద్రరావు విమర్శించారు. దళిత ఉద్యమ పోరాటాల ఫలితంగా, 2015 సంవత్సరంలో భారతదేశంలో మొదటిసారిగా అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరిపారని తెలిపారు. అప్పటి నుండి 11 సంవత్సరాలుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని న జరపాలా వద్దా అనే డోలాయమాన స్థితిలో, ప్రభుత్వ నుంచి ఆదేశాలు, జీవోలు రాలేదనే వంకతో ఏర్పాట్లు కూడా చేయలేదని అన్నారు.
అమెరికా రాజ్యాంగ రచనకు నాలుగు నెలల సమయం పట్టిందని, ఆస్ట్రేలియా దేశానికి సుమారు 9 సంవత్సరాల కాలం పట్టిందని అన్నారు. అయితే, అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ రచన ముసాయిదా తయారయ్యే నాటికి, అందులోని సభ్యులే 2,743 అభ్యంతరాలతో అంబేద్కర్ ను అడ్డుకున్నారని తెలిపారు. అంబేద్కర్ అసలు రాజ్యాంగం స్టేట్స్ అండ్ మైనారిటీస్ మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, కార్యదర్శి కాకమాను రవి, పట్రా బంగారం, కోలా జీవరత్నం, వేలూరి శ్రీనివాసరావు, దామవరపు నాగసాయి, దేవరపల్లి గోపి, ఎమ్మార్పీఎస్ నాయకులు తిరువీగుల బాబు తదితరులు పాల్గొన్నారు.






