చేజర్ల, 2026-11-29
చేజర్ల మండలం పెరుమళ్లపాడు గ్రామ సర్పంచ్‌గా యల్లంటి ప్రసాద్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి యల్లంటి వెంకటేశ్వర్లుపై 52 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన, మొత్తం 8 వార్డులకు గాను 6 వార్డులను తన వర్గం కైవసం చేసుకుంది.
చేజర్ల మండలం పెరుమళ్లపాడు గ్రామ సర్పంచ్‌గా యల్లంటి ప్రసాద్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి యల్లంటి వెంకటేశ్వర్లుపై 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 8 వార్డులకు గాను 6 వార్డులను ఆయన వర్గం కైవసం చేసుకుంది. ఇరువైపులా టీడీపీ మద్దతు ఉన్న రెబల్ అభ్యర్థులు కావడంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇరు రెబల్ అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో చివరకు యల్లంటి ప్రసాద్ విజయం సాధించారు.
పెరుమాళ్ళపాడు గ్రామ పంచాయతీలో గుత్తాధిపత్య రాజకీయానికి ప్రజలు చరమగీతం పాడి, విజయాన్ని అందుకున్నారు. ఈ విజయాన్ని సొంతం చేసుకున్న ఒక వర్గం సంబరాలు చేసుకుంటోంది. పలసాని ఈశ్వర్ రెడ్డి, కిలారి జయరామయ్య ఇరువురు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి యల్లంటి ప్రసాద్ విజయం సాధించడంతో ఆ వర్గానికి చెందినవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


