కల్పించాలి (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 24
పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం నగరం మండలం అద్దంకి వారి పాలెం గ్రామంలోని పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నగరం : పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం, నగరం మండలం, అద్దంకి వారి పాలెం గ్రామంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా, రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జరగనున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించి, నగరం మండలం, అద్దంకి వారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ర్యాంపులు వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నగరం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎన్నికల మెటీరియల్ ను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారిణి బి. శ్రీదేవి, తహశీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.



