యూపీఏ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించగా, తాను కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చూసుకున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ వెల్లడించారు. తన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్లో ఈ విషయాలను ప్రస్తావించారు. మన్మోహన్ సింగ్తో తమ మధ్య బాధ్యతల విభజన స్పష్టంగా ఉండేదని, ఇద్దరం సమన్వయంతో పనిచేశామని తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఫైళ్లను తెప్పించుకున్నానన్న ఆరోపణలను ఆమె ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. 2004లో ప్రధానమంత్రి పదవిని చేపట్టకూడదని ముందుగానే నిర్ణయించుకున్నానని, తన పిల్లలు రాహుల్, ప్రియాంక కూడా భద్రతా కారణాలతో ఆ నిర్ణయానికి మద్దతు తెలిపారని సోనియా గాంధీ వెల్లడించారు.
ప్రభుత్వ ఫైళ్లపై ఆరోపణలు అవాస్తవం: సోనియా గాంధీ - క్రౌన్ హ్యూమన్ రైట్స్
Share:

సారాంశం
యూపీఏ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించగా, తాను కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చూసుకున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ వెల్
ముఖ్య విషయాలు
- ప్రభుత్వ ఫైళ్లపై ఆరోపణలు అవాస్తవం: సోనియా గాంధీ - క్రౌన్ హ్యూమన్ రైట్స్ [object Object]
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి
D
Desk Team 1
Reporter




