క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-21
దళితుల హక్కులపై ప్రభుత్వాల వైఖరి
దళితుల హక్కులపై ప్రభుత్వాల వైఖరి
కేంద్రంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు దళితుల హక్కులను కాలరాస్తున్నాయని నీలం నాగేంద్రరావు ఆరోపించారు. అగ్రకుల, మనువాద పాలకుల పాలనలో దళిత బహుజనులు నిరంతరం అప్రమత్తులై ఉండాలని, దళితులు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కొరకు ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు, 21 ఏళ్లు నిండిన పురుషులకు కుల, మత, లింగ వివక్ష లేకుండా, చదువు, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా భారత దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారని తెలిపారు. కావున అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని దళిత బహుజనులకు నీలం నాగేంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, దామవరపు నాగసాయి, కాకుమాను రవి, తానికొండ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


