కవచం!” (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 26
రాజ్యాంగమే భారత ప్రజాస్వామ్యానికి జీవనాడి, మన హక్కులకు రక్షణ కవచం అని పలువురు పేర్కొన్నారు.
రాజ్యాంగమే భారత ప్రజాస్వామ్యానికి జీవనాడి, మన హక్కులకు రక్షణ కవచం అని పలువురు పేర్కొన్నారు. కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగంపై విద్యార్థులకు క్విజ్ మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు రాజ్యాంగ పీఠికను పఠించి, దాని ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఇ.హనుమంతరావు, ఉపాధ్యాయినులు వీరాంజనీదేవి, సునీతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


