బాపట్ల, 2026-11-25
భారత రాజ్యాంగమే దేశానికి సర్వోన్నతమని, భవిష్యత్ భారత నిర్మాణానికి రాజ్యాంగమే దిక్సూచి అని జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రజల్లో రాజ్యాంగ చైతన్యం మరింతగా వికసించాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగమే దేశానికి సర్వోన్నతమని, భవిష్యత్ భారత నిర్మాణానికి రాజ్యాంగమే దిక్సూచి అని జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజల్లో రాజ్యాంగ చైతన్యం మరింతగా వికసించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రాధాన్యతను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సవరణల స్ఫూర్తికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాలు ఏర్పడి, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. బాపట్ల ఐక్యవేదిక కన్వీనర్ గురజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన ఆశయాలు, లక్ష్యాలను ఇంకా పూర్తిస్థాయిలో సాధించాల్సి ఉందని గురజాల శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, శాస్త్రీయ ఆలోచనా విధానం, సమసమాజ నిర్మాణం వంటి రాజ్యాంగ మౌలిక విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించి ఆచరించాలని సూచించారు.
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు సాధించిన దానితోనే సంతృప్తి చెంది అదే విజయమని భావించడం పొరపాటని, సమస్త ప్రజలకు శ్రేయస్సు కలిగించే సమసమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలని ఆయన పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధనకు ప్రజలందరిలో రాజ్యాంగంపై అవగాహన, చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట వెంకటేశ్వర్ రెడ్డి, గురజాల శ్రీనివాసరావు, సుభాష్ చంద్రబోస్, సీతారామిరెడ్డి, చిన్నబాబు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.







