విశాఖపట్నం, 2026-11-20
నక్కపల్లిలో జరగనున్న అండర్-17 హాకీ పోటీలకు సిద్దరాంపురం జడ్పీ హైస్కూల్ నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు.
విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో , 6, 7 తేదీలలో జరగనున్న అండర్-17 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు సిద్దరాంపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన హారిక, మునీంద్ర ఎంపిక కాగా, వర్షిత స్టాండ్-బైగా ఎంపికయ్యారు.
ఈ వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ గట్టు నాగరాజుతో పాటు ఉపాధ్యాయ బృందం నాగేంద్ర ప్రసాద్, కోటప్ప, ఆదినారాయణ, బాలకృష్ణ, కమల, మధుబాల, ఉమాబాయి, తోటి విద్యార్థులు అభినందించారు.
రాబోయే టోర్నమెంట్లో కూడా వీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.





