డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, 2026-11-27
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి బలపరిచిన అభ్యర్థి కోట సోమేశ్వరరావు తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ, తమకు కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే తన ప్యానెల్‌లోని 20 మంది వార్డు మెంబర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా కోట సోమేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, రావులపాలెంను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే తమ సంకల్పమని తెలిపారు.
ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కూటమి నాయకులు పేర్కొన్నారు.



