అమరావతి, 2026-06-05
గిరిజన హక్కుల పరిరక్షణ, గ్రామసభల బలోపేతం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తి అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామసభల పరిధిలో ఈ కార్యక్రమం అమలు కానుంది.
గిరిజన హక్కుల పరిరక్షణ, గ్రామసభల బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వం శక్తి కార్యక్రమాన్ని చేపట్టింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి గ్రామసభ పరిధిలో హక్కుల అవగాహన, వనరుల ప్రణాళిక, సంస్కృతిక్రీడలు, విద్యాసంక్షేమం కోసం నాలుగు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది.
మహిళలకు ప్రాధాన్యత
ఈ కమిటీల్లో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు చైర్పర్సన్, సెక్రటరీ బాధ్యతలను గిరిజనులకే అప్పగించనున్నారు. పెసా చట్టం, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అటవీ వనరులు, గిరిజన సంస్కృతి పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నారు.









