క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-24
తాడిగడప మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్ర ప్రసాద్ కానూరు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.
తాడిగడప మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వీ.బీ రాజేంద్ర ప్రసాద్ కానూరులోని 29, 31వ వార్డుల్లో ఇంటింటికి వెళ్లి, ఓటర్లను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణాల అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించడంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
ఎన్టీఆర్ పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీని స్థాపించారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా, విజన్ తో ముందుకు తీసుకెళ్తున్నారని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణాలు, గ్రామాలు అధ్వాన్నంగా మారి, అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమం పేరుతో ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని రాజేంద్రప్రసాద్ విమర్శించారు.
తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ అజ్మతుల్లా బాబు, యనమల్లకుదురు మాజీ సర్పంచ్ భూక్య బిచ్చలి, టీడీపీ నాయకులు మహమ్మద్ ఆసిఫ్, టీడీపీ 31వ వార్డు అభ్యర్థి వేముల వెంకటేశ్వరరావు, 29వ వార్డు అభ్యర్థి సింగుదాసు మౌనిక, ఇంకా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


