క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-25
వేటపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా కొత్త నాగ పద్మజ పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
వేటపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్త నాగ పద్మజ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి మద్దతుతో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచిన కొత్త నాగ పద్మజకు ఎన్నికల సంఘం మంచం గుర్తు కేటాయించింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆమె తరఫున విజ్ఞప్తి చేస్తూ, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణతో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ ఎన్నికలు 29వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. వేటపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొత్త నాగ పద్మజ ఎన్నికల గుర్తు మంచం కావడంతో గ్రామంలో ఈ గుర్తును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు.







