నటుడు మోహిత్ మాలిక్ త్వరలో తెరకెక్కనున్న వజ్ర్ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ మాధ్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. మహావీర్ జైన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆధ్యాత్మిక అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో మోహిత్ మాలిక్ పోషించనున్న పాత్రకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం గోప్యంగా ఉంచింది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, మోహిత్ మాలిక్ తొలిసారిగా కలిసి నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. చిత్రంలోని కీలక సన్నివేశాలను జపాన్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల మీర్జాపూర్: ది మూవీలో బిర్జు లోహర్ పాత్రతో గుర్తింపు పొందిన మోహిత్ మాలిక్.. ఇప్పుడు వజ్ర్ సినిమాలో ప్రతినాయకుడిగా కొత్త తరహా పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.


