క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-24
మండల కేంద్రమైన యడ్లపాడులోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం కార్తీక పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ప్రధాన అర్చకులు కొల్లిపర కమల్చైతన్యశర్మ ఆధ్వర్యంలో వేకువజామున స్వామివారికి పాలతో అభిషేకం నిర్వహించారు.
మండల కేంద్రమైన యడ్లపాడులోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం కార్తీక పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ప్రధాన అర్చకులు కొల్లిపర కమల్చైతన్యశర్మ ఆధ్వర్యంలో వేకువజామున స్వామివారికి పాలతో అభిషేకం నిర్వహించి, స్వామివారితో పాటు ఇతర దేవతామూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం ఆలయంలో దీపార్చన అనంతరం ప్రాంగణంలో నిర్వహించిన జ్వాలాతోరణం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని శివపార్వతుల ఉత్సవమూర్తులతో కలిసి జ్వాలాతోరణం దాటి మొక్కులు చెల్లించుకున్నారు.


