కారంచేడు, 19 October
ఎన్నికల వేళ మండల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మండల పరిధిలోని స్వర్ణ-1 ఎంపీటీసీ స్థానంపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భాగస్వామ్యంలో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు.

ఈ నేపథ్యంలో స్వర్ణ-1 ఎంపీటీసీ అభ్యర్థిగా బీజేపీ తరపున లక్కాకుల వంశీ పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానికంగా పట్టున్న నాయకుడిగా వంశీ పేరు తెరపైకి రావడంతో కూటమి వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఈ స్థానాన్ని కూటమి ఏ పార్టీకి కేటాయిస్తుంది, అధిష్ఠానం ఎవరికి ఆమోదం తెలుపుతుంది అనేది తెలియాల్సి ఉంది.