రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈనెల 8వ తేదీన పర్చూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ పర్యటనలో శ్రీకారం చుట్టనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు.
పర్చూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలు మంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మండల అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు (ఫ్యాక్టరీ) పిలుపునిచ్చారు.
అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు షేక్ శంషుద్దీన్, కోడూరి శేషా బ్రహ్మచారి మాట్లాడుతూ పర్చూరు అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











