రాజకీయ దురంధరుడు, ప్రజా హృదయ విజేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా బుచ్చినాయుడు మండలంలో అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జ్ నూకతాటి రాజేష్, మండల కన్వీనర్ మణి నాయుడు సమక్షంలో పార్టీ శ్రేణులు ఈ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక దేవాలయంలో పెద్దిరెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
వైఎస్సార్సీపీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో అన్నదానం
ఈ వేడుకల్లో భాగంగా వైఎస్సార్సీపీ యూత్ వింగ్ ప్రధాన పాత్ర పోషించి, ముందుండి కార్యక్రమాలను నడిపించింది. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో సుమారు 500 మందికి పైగా పేదలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం పార్టీకి కొండంత బలమని, ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లాలని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం శ్రేణులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, వైయస్ జగన్ అభిమానులు, పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి అభిమానులు, మిధున్ రెడ్డి ఫాలోవర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.








