అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తూ అమరులైన అటవీ శాఖ సిబ్బందికి అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.
అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తూ అమరులైన అటవీ శాఖ సిబ్బందికి అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఘన నివాళులు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయం. విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం, నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకం. అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపిన మార్గంలో ముందుకు సాగుదాం. అడవులను కాపాడుదాం. వన్యప్రాణులను సంరక్షిద్దాం. ప్రకృతిని పరిరక్షిద్దాం. భావితరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందిద్దాం. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు











