యూనిట్) (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 02
చటటణిింబంధించిచెతతేటెంమండంమంిధిోిిడేటమేేజమెంటూిటండితితంటూజగతచంతఆగహంతంచేశ.ఈచంెిటేటదందఉంది,అబదధచతోభూమధెంచతిఆోించ.
చీరాల పట్టణ మున్సిపల్ వార్డులకు సంబంధించిన చెత్తను వేటపాలెం మండలం రామాపురం పరిధిలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నాయకులు రామాపురం డంపింగ్ యార్డ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్‌ను ఇక్కడి నుండి వేరే చోటికి తరలించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక లేఖలు, ఆర్డర్ కాపీలను ఈ సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు.
డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి వెళ్లిపోతోందంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ, ఈ ప్రాంతంలో భూముల ధరలను కృత్రిమంగా పెంచి అధికార పార్టీ నేతలు మరియు కొంతమంది స్వార్థపరులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని మండిపడ్డారు. సరైన రిజిస్ట్రేషన్లు కూడా లేని ఇటువంటి వివాదాస్పద స్థలాలలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు తమ కష్టార్జితాన్ని పెట్టి మోసపోవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అబద్ధపు హామీలతో కొనుగోలుదారులను మోసం చేస్తున్న వారిపై భవిష్యత్తులో చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రామాపురం నుండి ఈ డంపింగ్ యార్డ్‌ను తరలించి, మున్సిపాలిటీలోని 30, 32 వార్డుల్లోని దళిత, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల వద్ద ఏర్పాటు చేయడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. పేద ప్రజల ఆరోగ్యం, జీవితాలతో ఆడుకునే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












