నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. సోమవారం ముగిసిన మూడు రోజుల బిడ్డింగ్‌లో రూ.22,569 కోట్ల ఐపీఓ మొత్తం 5.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం 8.86 కోట్ల షేర్లకు గాను 50.58 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.
ఎన్ఎస్ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ () విభాగం 12.68 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల () విభాగం 6.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.39 రెట్లు సబ్స్క్రిప్షన్ పొందాయి. ఉద్యోగుల కోసం కేటాయించిన వాటా 2.40 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.90,000 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఎన్ఎస్ఈ ఐపీఓ దేశంలో పరిమాణం పరంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా తర్వాత రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచింది.
ఐపీఓలో ఒక్కో షేర్ ధరను రూ.1,700 నుంచి రూ.1,785గా నిర్ణయించారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ () కావడంతో కొత్త షేర్ల జారీ ఉండదు. ఇప్పటికే ఉన్న వాటాదారులు తమ షేర్లను విక్రయిస్తున్నారు.
ఐపీఓ కేటాయింపు ప్రక్రియ నవంబర్ 23న పూర్తయ్యే అవకాశం ఉంది. విజయవంతమైన దరఖాస్తుదారుల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు నవంబర్ 24న జమయ్యే అవకాశం ఉంది. ఎన్ఎస్ఈ షేర్లు నవంబర్ 25న మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.
ఎన్ఎస్ఈ పబ్లిక్ మార్కెట్లోకి రావడం దాదాపు దశాబ్దకాలంగా కొనసాగుతున్న లిస్టింగ్ ప్రక్రియకు ముగింపు పలుకుతోంది.












