బాపట్ల, 9 September
మార్టూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు, ఆయన అరెస్టు తదితర పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడం, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.
మార్టూరులో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మార్టూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. పార్టీ అధికారిక కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ‘నిజం గెలవాలి’ కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేసి ప్రజాస్వామ్య విలువలు, న్యాయం, సత్యం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు, ఆయన అరెస్టు తదితర పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడం, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజాస్వామ్యంలో నిజం, న్యాయం, ప్రజాభిప్రాయానికి ఉన్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించడంతో పాటు, రాజకీయ పరిణామాలపై ప్రజలు వాస్తవాలను తెలుసుకునేలా చైతన్యపరచడం ‘నిజం గెలవాలి’ కార్యక్రమం లక్ష్యమని నాయకులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్య విలువలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








