గుంటూరు, 2026-06-05
గుంటూరు జిల్లా పెదపలకలూరులో అధికార వైసీపీ నేతల అరాచకాలపై గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీ నేత నాగేష్ తమను తీవ్రంగా వేధిస్తున్నాడని, అధికార అండతో అరాచకాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారు.

భూముల ఆక్రమణ, మోసం ఆరోపణలు
వైసీపీ నేతల ఒత్తిళ్లతో తమ -పట్టా భూమిని బలవంతంగా ఆక్రమించారని, తమకు న్యాయం చేసి భూమిని తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పీఏ కూడా పోలీసుల అండదండలతో రెచ్చిపోతున్నారని మరికొందరు ఆరోపించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కారుణ్య నియామకం పేరుతో మోసం
మరోవైపు కారుణ్య నియామకం ఇప్పిస్తానంటూ రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశారని ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు.
మంత్రి హామీ
ఈ మేరకు అర్జీలను స్వీకరించిన మంత్రి కొలుసు పార్థసారథి.. బాధితుల సమస్యలను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.