ఏలూరు, July 23
ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో గురువారం పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో దేశ ఇంధన రంగంపై కీలక చర్చలు జరిగాయి.
పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం గురువారం ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో గల సమన్వయ్ -5 హాలులో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి, స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్న ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా హాజరయ్యారు.
సమావేశానంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియాకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో దేశీయంగా పెట్రోలియం మరియు ఇంధన రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
చర్చించిన అంశాలలో ఇంధన రంగంలో పారదర్శకతను పెంచేందుకు అనుసరిస్తున్న పోటీ బిడ్డింగ్ విధానాలపై సమీక్ష, దేశవ్యాప్తంగా ఇంధన రిటైల్ మౌలిక సదుపాయాలను మరింత విస్తృతం చేయడంపై దిశానిర్దేశం, మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రత్యామ్నాయ, స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక చర్చ ఉన్నాయి.












