వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఫోన్లో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని, ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
తమ్ముడు వినయ్.. ఉద్యమ నాటి గుర్తులను మళ్లీ గుర్తు చేశావు అని కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సైతం వినయ్ భాస్కర్ గారిని ఫోన్లో పరామర్శించారు.












