ఏలూరు, 21/07/2026
ముదినేపల్లి మండలం శింగరాయపాలెం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రతినిధులు, చైర్మన్ బొంగు రవి కుమార్, ఈవో మరియు సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్‌ను వరహాపట్నంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగష్టు 7న జరిగే ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవానికి ఆయనను ఆహ్వానించారు.
ముదినేపల్లి మండలం శింగరాయపాలెం గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతినిధులు, చైర్మన్ బొంగు రవి కుమార్, ఈవో మరియు సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారిని వరహాపట్నం గ్రామములో ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా, వచ్చే నెల అనగా ఆగష్టు 7వ తేదీన జరగనున్న ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవానికి ఆయనను ఆహ్వానించారు. అనంతరం, ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












