వార్డు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 02
రాబోయే ఎన్నికల నేపథ్యంలో చీరాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముమ్మర భద్రతా చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీరాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో 10వ వార్డులో సిబ్బందితో కలిసి విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
చీరాల 10వ వార్డులో పోలీసుల ముమ్మర ఫుట్ పెట్రోలింగ్
- నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఐ సోమశేఖర్ పిలుపు
చీరాల సెప్టెంబర్ 2
రాబోయే ఎన్నికల నేపథ్యంలో చీరాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు ముమ్మర భద్రతా చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 10వ వార్డు ఉడ్ నగర్ చర్చ్ కాంపౌండ్ పరిధిలో బుధవారం వన్ టౌన్ సిబ్బందితో కలిసి విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. వార్డులోని ప్రధాన వీధులు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కాలినడకన పర్యటించి అక్కడి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. రాబోయే ఎన్నికల్లో స్థానిక ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారికి భరోసా కల్పించారు. అనంతరం సీఐ సోమశేఖర్ గారు మాట్లాడుతూ ఎన్నికల వేళ పట్టణంలో అల్లర్లు సృష్టించినా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వార్డుల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో వన్ టౌన్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












