మండల కేంద్రంలో సోమవారం ఉదయం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారిపై ఒక గ్రానైట్ వాహనం మార్గమధ్యంలో మొరాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి, ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మార్టూరులో భారీ ట్రాఫిక్ జామ్.. గంటల తరబడి వాహనదారుల అవస్థలు! మార్గమధ్యంలో గ్రానైట్ వాహనం చెడిపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసుల తీవ్ర శ్రమ మండల కేంద్రమైన లో సోమవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారిపై ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారిపై ఒక గ్రానైట్ వాహనం మార్గమధ్యలో చెడిపోవడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కొద్దిసేపట్లోనే ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వాహనదారులు ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి వెళ్లలేక గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు. అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూ వాహనాలను ఒక్కొక్కటిగా ముందుకు పంపిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రణలోకి తీసుకువచ్చారు. గ్రానైట్ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ప్రధాన రహదారిపై ఇలాంటి వాహనాలు మార్గమధ్యలో మొరాయించడం, ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో నిలిచిపోవడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారిపై భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు, వాహనాలు చెడిపోయినప్పుడు వెంటనే తొలగించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. — క్రౌన్ హ్యూమన్ రైట్స్

