
సువార్త ప్రచారంతో పాటు విద్య, వైద్య సేవలను ప్రజలకు అందించాలనే మహోన్నత సంకల్పంతో జీవితాన్ని అంకితం చేసిన సువార్త సేవకుల సేవలు సమాజానికి ఎప్పటికీ మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సువార్త పరిచర్యకు పునాది వేసిన తొలి లూథరన్ మిషనరీ రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హాయ్యర్ సేవలను స్మరించుకుంటూ స్థానిక సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.



















