
చింతలపూడి నుంచి సత్తుపల్లి మండలం గంగారం వరకు రాకపోకలు సాగించే ప్రజలు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు సాయంత్రం వేళల్లో గంగారం నుంచి చింతలపూడికి తిరిగి రావడానికి బస్సు సర్వీస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోరుతూ వారు చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ గారికి వినతి పత్రం అందించారు.



















