జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మండలంలోని పందిళ్లపల్లికి చెందిన శాంతినికేతన్ మహిళా మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
లోని చారిత్రక సారస్వత నికేతనం గ్రంథాలయంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని నీలకంఠపురం అనాథ వృద్ధాశ్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు బన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధనలో మహాత్మా గాంధీ చేసిన విశేష కృషిని స్మరించుకున్నారు.
గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం
సత్యం, అహింసా మార్గాల్లో గాంధీజీ సాగించిన ఉద్యమం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను అనుసరించాలని వృద్ధులు, నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మండల జడ్పీటీసీ బండ్ల తిరుమలాదేవి, శాంతినికేతన్ మహిళా మండలి అధ్యక్షురాలు గుమ్మడి సుశీల, పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు ప్రత్తి వెంకట సుబ్బారావు, నున్నా శివప్రసాద్, మాజీ ఎంపీటీసీ పేరిశెట్ల పద్మజ, బులసల రామలక్ష్మి, వంకా శ్రీనివాసరావు, కరణం మురళీకృష్ణ, లైబ్రేరియన్ శ్రీవల్లి, ఆశ్రమ కన్వీనర్ డా. సత్రం మల్లేశ్వరరావు, అధ్యక్షుడు గుత్తి విశ్వేశ్వరరావు, కార్యదర్శి సజ్జా జోగేశ్వరరావు, ఆశ్రమంలోని వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.








