చిలకలూరిపేట, 2026-06-05
నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాస్తవ్యులు భట్టరుశెట్టి రాజేంద్రప్రసాద్ కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఘనంగా జరిగింది. ఈనెల 20న ఒంగోలులో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.

వధూవరులకు శుభాకాంక్షలు
ఈ రిసెప్షన్ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులు వెంకటరమణ, స్వర్ణ శ్రీలను ఆయన ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కాట్రు శ్రీనివాసరావు, బింకం నాగేశ్వరరావు, ముత్యాల సుధాకర్ రావు, బొప్పూడి శ్రీనివాసరావు, తూబాటి రామారావు, పంతులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.