చీరాల, 2026-08-19
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల ఎన్.ఆర్.పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ వాకింగ్ సమయంలో ఫోటోలు తీస్తూ కార్యక్రమాలను చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్ గ్రంథి నారాయణమూర్తిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఫోటోగ్రఫీ ఒక అద్భుత కళ
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ ఒక అద్భుతమైన కళ అని అన్నారు. గడిచిపోయిన సంఘటనలను, మధుర జ్ఞాపకాలను భద్రపరచి భవిష్యత్లో మరోసారి గుర్తు చేసుకునేలా చేసేది ఫోటో అని పేర్కొన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఫోటోగ్రఫీ రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఫోటోగ్రాఫర్లు తమ ప్రతిభతో ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని చిత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారని అన్నారు.
స్వీట్స్ పంపిణీ, సన్మానం
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వాకింగ్ సభ్యులకు స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫోటోగ్రాఫర్ గ్రంథి నారాయణమూర్తిని అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, సెక్రటరీ చారగుళ్ల గురుప్రసాద్, కోశాధికారి జి. సుధాకరరావు, తారకరామారావు, పూర్ణ, రవి, తుకారాం, శ్రీనివాసరావు, సుబ్బారావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు, రమేష్, ప్రసాద్ తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.